జీతం వృధా చేసుకుంటే రేపు ఎవడు ఇస్తాడు..? ఇవి ఫాలో అవండి చాలు…!

-

ప్రస్తుత రోజుల్లో డబ్బు సంపాదనకు ఎన్ని మార్గాలు ఉన్నయో ఆ సంపాదించిన సొమ్మును ఖర్చు చేయడానికి అంతకు మించి అవసరాలు కూడా అంతే ఉన్నాయని చెప్పాలి… అయితే ఆ అవసరాలు ఎంత వరకు ముఖ్యం అనేది ఒక ప్రశ్న..?ఎందుకంటే ప్రతి ఒక్కరికీ సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో పొదుపు చేయడం అనేది కూడా అంతే ముఖ్యం… ఈ రోజు చేతినిండా డబ్బు ఉన్నప్పుడు లెక్కలేనంత ఖర్చు చేసి తర్వాత కొంత కాలానిక సంపాదన తగ్గితే ఏం చెయ్యాలి… అందుకే ఎంత సంపాదించాను అన్నది కాదు..!

సంపాదించిన డబ్బులో ఎంత పొదుపు చేశాం అన్నది ముఖ్యం… రోజు రోజుకూ ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం…అందుకే దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది… సంపాదన నిండు గా ఉన్నప్పుడు పొదుపు చేసుకోవాలి…ఇప్పుడు పొదుపు చేసిన డబ్బు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలి… పిల్లల చదువుల కోసం , స్థిరాస్తి పలపరుచుకోవడనికి పొదుపు ఉండాలి… ఇవన్నీ జరగాలంటే ఖర్చులు అదుపులో ఉండాలి…

ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్ ద్వారా క్రెడిట్ కార్డులు వాడటం వల్ల వారికి తెలియకుండానే జేబులు ఖాళీ అయిపోతున్నాయి… జీతం అకౌంట్ లోకి వచ్చిన వారం రోజులకే ఖాతా కాళీ చేసేస్తున్నారు… కాబట్టి క్రెడిట్ కార్డులు ఎంత వరకు అవసరం అనేది ఆలోచన తప్పకుండా ఉండాలి…అందుకే ప్రతి ఒక్కరికీ వారు చేసే ఖర్చుల మీద ఒక లెక్క తప్పనిసరిగా ఉండాలి… వచ్చిన ఆదాయం లో ఖర్చులకు కొంత కేటాయించి కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి… కొనే ప్రతి వస్తువు ఎంత వరకు అవసరం అనేది ఒక అవగాహన ఉండాలి…

ఇది తప్పనిసరి అవునో కాదో ఆలోచించి ఖర్చులు చేయాలి…షాపింగ్ కి కూడా ఒక లిమిట్ పెట్టుకోవాలి… పొదుపు చేసే డబ్బును తిరిగి మనకు ఆదాయాన్ని తెచ్చే వాటిలో పెట్టుబడి రూపంలో ఉండాలి… ఉదాహరణకు ప్రతి నెల కొంత డబ్బును రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో భద్రపరచాలి… వీటి ద్వారా మనం తిరిగి ఆదాయాన్ని పొందవచ్చు…. అద్దె ఇంట్లో ఉండేవారు వారు చెల్లించే అద్దె సొమ్ముకు మరికొంత కలిపి హోమ్ లోన్ తీసుకుని నెల నెలా emi రూపం లో కడుతూ సొంత ఇంటిని కొనుగోలు చేస్తే అది వారికి స్థిరాస్తి గా మిగిలిపోతుంది…

భవిష్యత్ అవసరాలకు పొదుపు చేయడం కోసం ఎంచుకునే వాటిలో ఇన్సూరెన్స్ లు ముఖ్య పాత్ర వహిస్తాయి… సంపాదన ఉన్నప్పుడు వీటిలో కొంత కాలం పాటు డబ్బును పొదుపు చేస్తే తర్వాత కాలంలో అవి మన అవసరాలకు తగ్గట్టుగా వుంటాయి… ఈ రోజు చేసిన పొదుపు ఊరికే పోదు అది మనకు ఆ తర్వాత మన వాళ్లకు ఎంతగానో ఉపయోగపడతాయి… సంపాదన ఉన్నప్పుడు ఖర్చు చేసి లగ్జరీగా జీవించడం కంటే సంపాదన ఉన్నప్పుడు అది లేనప్పుడు కూడా ఒకేలా దర్జాగా బ్రతకడం లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తే కానీ తెలీదు… కాబట్టి ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది… ఆలోచించి ఖర్చులు చేయడం నేర్చుకోండి… పొదుపును అలవాటు గా చేసుకుని ఆనందం గా జీవించండి….

Read more RELATED
Recommended to you

Exit mobile version