Komatireddy Raj Gopal Reddy: మళ్లీ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గతంలో చేశానని… మళ్లీ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధం అన్నారు. పదవి రాలేదన్న ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌కు రూ.5000 కోట్ల నిధులు తీసుకుపోయిన నుంచి తనకు నిద్రపట్టడం లేదని చెప్పారు.

పదవితో పాటు పైసలు అన్ని ఆయనే తీసుకుపోతున్నారని ఫైర్ అయ్యారు. కనీసం పదవి లేకున్నా.. పైసలు మునుగోడుకు రావాలి కదా అని క్వశ్చన్ చేశారు. మునుగోడు అభివృద్ధిలో రాజీపడేది లేదన్నారు. వేల కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి. నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదని వెల్లడించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.