ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సిలింగ్‌ ప్రారంభం !

-

దేశవ్యాప్తంగా మొత్తం సీట్ల సంఖ్య-  50,798

  • 23 ఐఐటీల్లో సీట్ల సంఖ్య- 16,053
  • 31 ఎన్‌ఐటీల్లో సీట్ల సంఖ్య – 23,506

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్లు తదితర ప్రక్రియ అక్టోబర్‌ 6 నుంచే ప్రారంభమైంది. ఈ సారి 23 ఐఐటీల్లోని 16,053 సీట్లు, 31 ఎన్‌ఐటీల్లోని 23,506 సీట్లు, 26 ట్రిపుల్‌ఐటీల సీట్లను కలుపుకొని మొత్తం 101 విద్యాసంస్థల్లో సీట్లను జోసా ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ సారి ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో 2,673 సీట్లు ప్రత్యేకంగా అమ్మాయిలకు సూపర్‌ న్యూమరరీ కోటా కింద కేటాయించారు. గత నాలుగేండ్లుగా బాలికల శాతం పెంచడానికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సూపర్‌న్యూమరి కోటా కింద పెంచుతున్న విషయం విదితమే. మొదటి విడత సీట్లను అక్టోబ‌రు 17వ తేదీన కేటాయించనున్నారు. పూర్తి వివరాల కోసం జోసా వెబ్‌సైట్‌ చూడవచ్చు.

-శ్రీవిద్య

Read more RELATED
Recommended to you

Latest news