బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు లోకి వెళితే.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దీనిలో మొత్తం 26 ఖాళీలు ఉన్నాయి.

సంబంధిత సబ్జెక్టులో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేసిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇది ఇలా ఉంటే ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్ మార్కెంటిగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. అలానే సబ్జెక్టులో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేసి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే… 25 నుంచి 40 ఏళ్లు ఉండాలి. శాలరీ వివరాలను చూస్తే.. నెలకు రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.

ఇది ఇలా ఉంటే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (అక్విజేషన్ అండ్ రిలేషన్ షిప్ మేనేజర్) విభాగంలో కూడా ఖాళీలు వున్నాయి. దీనిలో 53 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ తో పాటు పీజీ డిగ్రీ లేదా డిప్లొమా(మేనేజ్మెంట్) కానీ సీఏ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

అభ్యర్థులకు సంబంధిత పని లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. అదే వయస్సు విషయానికి వస్తే.. 26 నుంచి 40 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. కనుక ఈ లోగా అప్లై చేసుకోవడం మంచిది. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను www.bankofbaroda.co.in లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version