క‌రోనా వ‌ల్ల జాబ్ పోయిందా ? ఈ కోర్సుల్లో మెళ‌కువ‌లు నేర్చుకుంటే ఉపాధి పొంద‌డం ఈజీ..

-

క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది కొలువుల‌ను పోగొట్టుకున్నారు. దీంతో ఇప్ప‌టికీ ఇంకా అనేక మంది గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. చేసేందుకు ఉద్యోగాలు దొర‌క‌డం లేదు. ఈ క్ర‌మంలో ఖాళీగా ఉండాల్సి వ‌స్తోంది. అయితే ఆ ప‌రిస్థితి ఉంద‌ని దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే క‌రోనా అనంత‌రం కింద తెలిపిన కెరీర్ల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. క‌నుక వీటిల్లో నైపుణ్యాలు నేర్చుకుంటే జాబ్ సంపాదించ‌డం లేదా స్వ‌యంగా ఉపాది పొంద‌డం పెద్ద‌గా క‌ష్ట‌మేమీ కాదు. మ‌రి ప్ర‌స్తుతం ఆక‌ర్ష‌ణీయంగా మారిన ప‌లు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

learn skills in these topics then getting job is easy

ప్ర‌స్తుత డిజిట‌ల్ యుగంలో డిజిట‌ల్ మార్కెటింగ్ కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఎస్ఈవోతోపాటు డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఈ రంగంలో ఉపాధి అవ‌కాశాలు పుష్క‌లంగా ల‌భిస్తాయి. అలాగే ఆన్‌లైన్‌లో విద్యార్థుల‌కు పాఠాలు కూడా చెప్ప‌వ‌చ్చు. ఆన్‌లైన్ టీచ‌ర్ల‌కు ప్ర‌స్తుతం డిమాండ్ పెరిగింది. క‌నుక ఈ దిశ‌గా స్కిల్స్ పెంచుకుంటే టీచింగ్ కెరీర్‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

ఇక కంపెనీలు ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటున్నాయి. అందువ‌ల్ల సైబర్ సెక్యూరిటీ నిపుణుల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. ఈ రంగానికి చెందిన కోర్సుల‌ను నేర్చుకుంటే ఇందులో సుల‌భంగా జాబ్ సంపాదించ‌వ‌చ్చు. అలాగే కంటెంట్ రైటింగ్‌, ఫ్యాష‌న్ డిజైనింగ్‌, గ్రాఫిక్ డిజైనింగ్‌, ఫొటోగ్ర‌ఫీ, ప‌బ్లిక్ రిలేష‌న్స్‌, కోడింగ్‌, ప్రోగ్రామ‌ర్‌, మార్కెటింగ్ వంటి అంశాల్లో నైపుణ్యాల‌ను క‌లిగి ఉంటే వాటిల్లో స్వ‌యం ఉపాధి ద్వారా కూడా రాణించ‌వ‌చ్చు. క‌నుక ఉద్యోగం లేద‌ని దిగులు ప‌డే బ‌దులు మీలో ఉండే ఏదో ఒక నైపుణ్యాన్ని మెరుగు ప‌రుచుకోండి. దీంతో జాబ్ సంపాదించ‌వ‌చ్చు. లేదా స్వ‌యం ఉపాధిని వెదుక్కోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news