ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఖాళీలు… వివరాలు ఇవే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,524 ఖాళీలు వున్నాయి. అప్లై చేయడానికి 2021 మే 2 చివరి తేదీ. పూర్తి వివరాలని అధికారిక వెబ్‌సైట్ https://indianairforce.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఇందులో హైదరాబాద్‌ లో కూడా ఖాళీలున్నాయి. స్టెనోగ్రాఫర్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కార్పెంటర్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టులు కూడా వున్నాయి.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్- 362, సదరన్ ఎయిర్ కమాండ్ యూనిట్- 28, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్- 132, సెంట్రల్ ఎయిర్ కమాండ్ యూనిట్- 116, మెయింటనెన్స్ కమాండ్ యూనిట్- 479, ట్రైనింగ్ కమాండ్ యూనిట్- 407.

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి నోటిఫికేషన్ లో చూడండి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇది ఇలా ఉంటే నోటిఫికేషన్‌లో యూనిట్ వారీగా పోస్టల్ అడ్రస్‌లు వేర్వేరుగా ఉన్నాయి. అభ్యర్థులు ఏ యూనిట్‌కు దరఖాస్తు చేస్తే ఆ యూనిట్ పోస్టల్ అడ్రస్‌కే దరఖాస్తు ఫామ్ పంపాలి. అలానే అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version