నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 89 పోస్టులు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశ వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. దీనితో ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ఈ నోటిఫికేషన్‌ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనుంది. వచ్చే నెల 31లోపు ఆన్‌లైన్ ‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్ (ఏజీఎం), మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మొత్తం 89 పోస్టులు ఉండగా ఇందులో ఏజీఎం 87 (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 30, టెక్నికల్‌ 27, అకౌంట్స్‌ 22, లా 8), మెడికల్‌ ఆఫీసర్‌ 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.

ఇక అర్హత విషయం లోకి వస్తే… సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ తో పాటు పీజీ చేసి ఉండాలి. మెడికల్‌ ఆఫీసర్‌, ఏజీఎం (లా) పోస్టులకు అనుభవం తప్పనిసరి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్‌ లో మీరు దరఖాస్తు చేయవచ్చు. అప్లికేషన్‌ ఫీజు రూ.1000. ఈరోజు నుండే అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31. మే లేదా జూన్ లో వ్రాత పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలని www.fci.gov.in లో చూడ వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news