తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ.కొత్తగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలతో మమేకమై గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానన్నారు. ఎంఎల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి తెలంగాణ బీజేపీని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు.

కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. అటు ఏపీలో విజయంపై కూడా స్పందించారు మోడీ. విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయన్నారు.