కొచ్చిన్ పోర్టులో కాంట్రాక్టు ఉద్యోగాలు.. ఇలా అప్లై చెయ్యండి..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేర‌ళ‌కు చెందిన‌ కొచ్చి పోర్టు ట్ర‌స్ట్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజ‌నీర్‌, సైట్ ఇంజ‌నీర్‌, ఆఫీస‌ర్ అసిస్టెంట్‌, కుక్‌, పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

 

jobs

అప్లె చేసుకోవ‌డానికి చివ‌రి తేది అక్టోబ‌ర్ 18, 2021. 8వ‌త‌ర‌గ‌తి నుంచి గ్రాడ్యుయేట్ చేసిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంది. అలానే కంప్యూర్ స్కిల్స్ ఉండాలి. ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. అప్లికేష‌న్ ఫాంలో అభ్య‌ర్థులు త‌మ పూర్తి వివ‌రాలు స‌రిగా న‌మోదు చేసి ఈ-మెయిల్‌ ఐడీ మొబైల్ నంబ‌ర్ ద‌ర‌ఖాస్తులో న‌మోదు చేయాలి. అలానే అభ్య‌ర్థుల ప‌ని అనుభ‌వం, అకాడ‌మిక్ అర్హ‌త‌ల ఆధారంగా మాత్ర‌మే షార్ట్ లిస్ట్ చేస్తారు.

ఇది ఇలా ఉంటే వేరు వేరు పోస్టులకి వేరు వేరు అర్హతలు వున్నాయి. https://www.cochinport.gov.in/careers ను సంద‌ర్శించి పూర్తి వివరాలు తెలుసుకోచ్చు. గరిష్ట వయసు 55 ఏళ్లు మించి ఉండకూడదు. ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు స‌మాచారం అందించి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

నోటిఫికేషన్: https://www.cochinport.gov.in/sites/default/files/2021-09/WEbsite%20advertisment%20dt.%2015.09.2021_1.pdf

Read more RELATED
Recommended to you

Exit mobile version