ఎస్‌జేవీఎన్‌లో ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలు… వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశంలోని మినీ ర‌త్న కంపెనీల్లో ఒక్క‌టైన SJVN లిమిటెడ్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి దరఖాస్తు చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

jobs
jobs

ఈ నోటిఫికేష‌న్ ఆధారంగా ఫీల్డ్ ఇంజ‌నీర్ పోస్టును భ‌ర్తీ చేయ‌నుంది. ముఖ్యంగా సోలార్ మరియు విండ్ ఎన‌ర్జీ విభాగంలో అనుభవం ఉన్న నిపుణుల నుంచి కంపెనీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కాంట్రాక్టు కాల ప‌రిమితి మూడు సంవ‌త్స‌రాలుగా ఉంటుంది. ప‌ని తీరు ఆధారంగా మ‌రో రెండు సంవ‌త్స‌రాలు కాంట్రాక్టును ఎక్స్టెండ్ చేసే అవకాశం వుంది.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), ఫీల్డ్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టులు వున్నాయి. ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) కి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి, అంతే కాకుండా రెండు సంవత్సరాల సోలార్, విండ్ పవర్ విభాగంలో పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించరాదు. మొత్తం నాలుగు ఖాళీలివి. ఫీల్డ్ ఇంజనీర్ (మెకానికల్) మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సోలార్, విండ్ పవర్ విభాగంలో పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించరాదు. ఇవి కూడా నాలుగు ఖాళీలు వున్నాయి.
అధికారిక వెబ్‌సైట్ www.sjvn.nic.in ను సంద‌ర్శించి పూర్తి వివరాలని చూడచ్చు. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబర్ 11, 2021

 

Read more RELATED
Recommended to you

Latest news