టెన్త్ అర్హతతో ఎయిర్‌పోర్టులో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. చెన్నై లోని ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆధ్వర్యం లోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆధ్వర్యం లోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల కోసం టెన్త్ ప్యాస్ అయి ఉండాలి.

కేవలం ప‌దవ త‌ర‌గ‌తి ఉత్తీర్ణత అయితే చాలు. ఎయిర్‌పోర్టులో ఉన్న ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసేసుకో వచ్చు. ఎలాంటి ప‌రీక్ష లేదు, కేవ‌లం ఫిజిక‌ల్ ఎఫిషియన్సీ ఆధారంగానే ఎంపిక చేయ‌నున్నారు. ఇక జీతం విషయానికి వస్తే.. జీతం నెల‌కు రూ.21,300 వ‌ర‌కు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆగస్ట్ 2 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

వయస్సు వివరాలు చూస్తే.. 2023 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్లకి ఐదేళ్లు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.250. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్ధులకు అయితే ఏ ఫీజు లేదు. పూర్తి వివరాలని మ‌రిన్ని వివ‌రాల‌కు http://aaiclas.aero/ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news