ఐఐటీ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. వివరాలివే.!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఐఐటీ హైద‌రాబాద్ ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఐఐటీ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేష‌న్ ద్వారా 24 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తోంది. అయితే దీనిలో వివిధ క్యాట‌గిరిల‌తో పాటు నాన్ టీచింగ్ విభాగంలోనూ ఖాళీల‌ను ఈ నోటిఫికేష‌న్  ద్వారా రిక్రూట్ చేసుకొంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

jobs
jobs

ఫీజు రూ.500, ఎస్సీ,ఎస్టీ,ఈడ‌బ్ల్యూఎస్‌, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళ‌ల‌కు వారికి ఫీజు మిన‌హాయింపు వుంది. అలానే వేరు వేరు పోస్టులకి వేరు వేరు విద్యార్హతలు వున్నాయి. దీని కోసం మీరు కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. నెక్స్ట్ అక్కడ ద‌ర‌ఖాస్తు ఫాంలో మీ పూర్తి స‌మాచారం అందించండి.

అనంత‌రం ఫీజు చెల్లించాలి. ఇలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ టెక్నికల్ సూపరిండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), టెక్నికల్ సూపరిటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్. అయితే పోస్ట్స్ అన్నింటికీ వేరు వేరు విద్యార్హతలు వున్నాయి. అలానే కొన్ని పోస్టులకి అనుభవం కూడా వుంది చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

website: https://iith.ac.in/careers/notification:https://staff.recruitment.iith.ac.in/advt/IITH_Staff_Recruitment_NF_9_detailed_advertisement_11_09_2021.pdf

https://iith.ac.in/careers/