మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. సెక్షన్ ఇంజనీర్స్ తో పాటు పలు ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మొదలై పోయింది. ఏఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి జనవరి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి రూ. 40 వేల నుంచి రూ. 1.65 లక్షల వరకు వేతనం ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.
ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు చీఫ్ ఇంజనీర్ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు అడిషనల్ చీఫ్ ఇంజనీర్/డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఆర్క్ లేదా ప్లానింగ్ లో డిగ్రీ చేసిన వారు డిప్యూటీ జీఎం పోస్టులకి అప్లై చెయ్యచ్చు.
అలానే సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఎగ్జిగ్యూటివ్ ఇంజనీర్ డిజైన్ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. బీ.ఆర్క్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు మేనేజర్ ఆర్క్ కి అప్లై చెయ్యచ్చు. అలానే బీ.ఆర్క్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు డిప్యూటీ మేనేజర్ (ఆర్క్) పోస్టులకి అప్లై చెయ్యచ్చు.
సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిజైన్ పోస్టుకి అర్హులు. అదే విధంగా ఆర్కిటెక్చర్ లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారు సెక్షన్ ఇంజనీర్(ఆర్క్) పోస్టులకి అర్హులు. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు సెక్షన్ ఇంజనీర్(డిజైన్) పోస్టులకి అప్లై చేసుకోచ్చు. పూర్తి వివరాలని https://english.bmrc.co.in/ లో చూసి అప్లై చేసుకోచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.