కాళోజీ హెల్త్ వర్శిటీ.. బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ విడుదల

-

రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ 2024–25 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి కాలేజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదివారం అనగా 6వ తేదీ నుంచి 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే, ఈ ఏపీసెట్–2024 పాస్ అయినవాళ్లు మాత్రమే దీనికి అర్హులు అని యూనివర్సిటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వ,ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు అన్నింటికీ ఇదే నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నిర్వహించి,మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని వెల్లడించింది.మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version