ఇండియన్​ నేవీలో 741 పోస్టులు.. అర్హతలేంటంటే?

-

ఇండియన్ నేవీలో పనిచేయాలనుకుంటున్నారా. అయితే మీకో శుభవార్త.  భారత నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరి ఆ పోస్టుల వివరాలేంటో ఓసారి చూసేద్దామా

ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్‌-01/2024) వివరాలు..

1 జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు

  • ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్) – 01 పోస్టులు
  • ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ) – 10 పోస్టులు
  • ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్) – 18 పోస్టులు
  • సైంటిఫిక్ అసిస్టెంట్ – 04 పోస్టులు

2. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-‘సి’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ పోస్టులు

  • డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌) – 02 పోస్టులు
  • ఫైర్‌మ్యాన్ – 444 పోస్టులు
  • ఫైర్ ఇంజిన్ డ్రైవర్ – 58 పోస్టులు
  • ట్రేడ్స్‌మ్యాన్ మేట్ – 161 పోస్టులు
  • పెస్ట్ కంట్రోల్ వర్కర్ – 18 పోస్టులు
  • కుక్ – 09 పోస్టులు
  • ఎంటీఎస్‌ (మినిస్టీరియల్) – 16 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య : 741

విద్యార్హతలు
పోస్టును అనుసరించి అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.295 చెల్లించాలి.
  • మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version