జియో సైంటిస్ట్, జియాలజిస్ట్ ఎగ్జామ్-2019 ప్రకటన విడుదల

-

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గనులు, నీటివనరుల శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ జియో సైంటిస్ట్ & జియాలజిస్ట్ ఎగ్జామ్- 2019 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 106

విభాగాల వారీగా ఖాళీలు: జియాలజిస్ట్ గ్రూప్ ఏ- 50, జియోఫిజిసిస్ట్ (గ్రూప్ ఏ)- 14, కెమిస్ట్ (గ్రూప్ ఏ) – 15, జూనియర్ హైడ్రోజియాలజిస్ట్ (సైంటిస్ట్ బీ)- 27 ఖాళీలు ఉన్నాయి.

వయస్సు: 2019, జనవరి 1 నాటికి జూనియర్ హైడ్రోజియోజియాలజిస్ట్ పోస్టులకు 21-35 ఏండ్లు, మిగతా పోస్టులకు 21-32 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హతలు: జియాలజిస్ట్ పోస్టులకు.. జియాలజికల్ సైన్స్/జియాలజీ లేదా జియో/మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, ఇంజినీరింగ్/మెరైన్ జియాలజీ, జియో కెమిస్ట్రీ, జియాలజికల్ టెక్నాలజీ, జియోఫిజికల్ టెక్నాలజీలో పీజీ/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. జియోఫిజిసిస్ట్ పోస్టులకు.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా ఎమ్మెస్సీ (జియోఫిజిక్స్/టెక్నాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.

కెమిస్ట్ పోస్టులకు.. కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ/అనలి-టికల్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

హైడ్రోజియాలజిస్ట్ పోస్టులకు.. జియాలజీ లేదా అప్ల-యిడ్/మెరైన్ జియాలజీలో పీజీ ఉత్తీర్ణత.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ.200/- (ఎస్సీ/ఎస్టీ,
పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)

చివరితేదీ: ఏప్రిల్ 16

పరీక్షతేదీ: జూన్ 28

వెబ్‌సైట్: www.upsconline.nic.in

Read more RELATED
Recommended to you

Exit mobile version