గుడ్ న్యూస్..హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్-SSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

మొత్తం దీనిలో అయితే 115 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 22 చివరి తేదీ. దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఆగస్ట్ 22. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10+2 పాస్ కావాలి.

అలానే నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్ చేయాలి. ఇక వయస్సు విషయంలోకి వస్తే.. 18 నుంచి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు అయితే అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

శాలరీ విషయంలోకి వస్తే ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 4 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సశస్త్ర సీమా బల్-SSB అధికారిక వెబ్‌సైట్ http://www.ssbrectt.gov.in/ తెలుసుకోవచ్చు.