2034 తెలంగాణ సీఎం గా అవకాశం వస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ రిపబ్లిక్ డే దినోత్సవం వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సమాజం తప్పకుండా నాకు పదేళ్లు అవకాశం ఇస్తుందన్నారు. 1994 నుంచి 2024 వరకు పార్టీలకు పదేళ్ల చొప్పున అవకాశం వచ్చిందని తెలిపారు.
2034 వరకు తెలంగాణలో అద్భుతాలు సృష్టించే వయసు, ఓపిక నాకు ఉన్నాయి అంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించామన్నారు.