ఈ మధ్య కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తగ్గట్టు గానే కొత్త కొత్త కోర్సులు కూడా వస్తున్నాయి. ఇవి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. అయితే తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను తీసుకు రావడం జరిగింది.
అయితే సైబర్ సెక్యూరిటీని కెరీర్ గా తీసుకోవాలనుకునే వాళ్లకి ఇది హెల్ప్ అవుతుంది. కేవలం విదేశీయులకే కాకుండా భారతీయ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీ మొత్తం 10 నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్సు. విద్యార్థులతో పాటు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఈ కోర్సులో చేరచ్చు.ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ డిసెంబరు 30న ప్రారంభమవుతుంది.
ఈ ప్రోగ్రామ్ కోసం USD 3,500 (రూ.2,66,967) ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ 29లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 ప్రకారం, 32 శాతం భారతీయ సంస్థలు గతేడాది కంటే 2021లో ఎక్కువ సైబర్‌టాక్‌లను ఎదుర్కొన్నాయి.
అందుకే అన్ని సంస్థలకు సైబర్‌నిపుణుల అవసరం పెరిగింది. అందుకని ఈ కోర్సు హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. దాదాపు 10 సంస్థల్లో ఏడు సంస్థలు సైబర్ సెక్యూరిటీకీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందువల్ల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.