రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 7,934 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.500. ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ,ఎస్సీలకు ఫీజు రూ.250.
ఇలా అప్లై చేసుకోవాలి..
- ముందుగా ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- RRB JE 2024 లింక్పై క్లిక్ చేసి మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లను ఎంటర్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీకొక ఎన్రోల్మెంట్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- వీటితో మళ్లీ ఆర్ఆర్బీ పోర్టల్లోకి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- మీరు అప్లై చేయాలని భావిస్తున్న పోస్టును ఎంచుకోవాలి.
- ఆన్లైన్లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.