ఉద్యోగం రావడానికైనా, ఉద్యోగం నిలబడటానికైనా కొన్ని నైపుణ్యాలు(స్కిల్స్) తప్పనిసరి. ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ రెండూ ఉంటేనే ఏ పని చేసినా ముందుకు వెళ్లగలరు. అసలు ఈ సాఫ్ట్, హార్డ్ స్కిల్స్ అంటే ఏంటో ఒక సారి చూద్దాం పడదండి.
ప్రస్తుత సమాజంలో ఉద్యోగుల ఎంపిక లో కీలకమైన పాత్ర పోషిస్తున్న ముఖ్యమైన స్కిల్స్ ఏంటి అంటే అందరూ ముక్త కంఠంతో చెప్పేది సాఫ్ట్ స్కిల్స్. దీని దగ్గరే ఎక్కువ మంది బోల్తాపడుతున్నారు. సమయపాలన నిర్వహణ ( Time management), టీమ్ వర్క్, బాషా నైపుణ్యాలు, నాయకత్వం లాంటి పలు అంశాలు సాఫ్ట్ స్కిల్స్ కిందకి వస్తాయి. వీటిని పెంపొందించుకోవడానికి విద్యార్థులు తమ డిగ్రీ స్థాయిలో తగిన కృషి చేయాలి. వీటికి సంబంధించిన పలు కోర్సులు ప్రస్తుతం ఆన్ లైన్ లో ఉన్నాయి.
హార్డ్ స్కిల్స్ విషయానికి వస్తే ఉద్యోగానికి కావల్సిన సంబంధిత అంశాలు మీద పట్టు సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలి. కష్టపడి చదివితే , నేర్చుకుంటే హార్డ్ స్కిల్స్ అందిపుచ్చుకోవడం పెద్ద విషయం కాదు. ఇందుకోసం ఆన్ లైన్ లో మరియు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నైపుణ్యా కేంద్రాల ద్వారా అందించే కోర్సులు కూడా చేయవచ్చు.