ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులకు యూజీసీ ఆమోదం!

-

కరోనా నేపథ్యంలో ఆన్‌ లైన్‌ చదువులకు ప్రాముఖ్యత పెరిగింది. అయతే పూర్తిగా ఆన్‌ లైన్‌ మాధ్యమంలో కొన సాగే కోర్సులకు తాజాగా యూనివర్సిటీ గ్రాంట్‌ కమీషన్‌(యూజీసీ) అనుమతిచ్చింది. దీనికోసం 37 విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేందుకు ఉన్నత విద్యా నియంత్రణ మండలి ఆమోదించింది.

ఇందులో జవహార్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఆరు నెలల నిరీక్షణ తర్వాత ఈ మేరకు ముందడుగు వేసింది. దీంతో ఇకపై ఆన్‌ లైన్‌ డిగ్రీలకు అధికారిక గుర్తింపు లభించనుంది. కోవిడ్‌ కారణంగా ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్‌ కోర్సులు ఈ ముందడుగుతో ఊపందుకుంటుంది. ఉన్నత విద్యలో ఎన్‌ రోల్‌ మెంట్‌ తో పాటు విశ్వవిద్యాయాలు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునేందుకు తమ వనరులు ఉపయోగించటానికి అనుమతి లభిస్తుంది. యూజీసీ ప్రస్తుతం సంస్కృతం నుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులను ఆన్‌ లైన్‌ లో అందించేందుకు ఆమోదించింది.

ఆన్‌ లైన్‌ కోర్సుల ద్వారా సంస్కృతంలో మాస్టర్స్‌ ప్రోగ్రాం ప్రారంభించాలని జేఎన్‌ యూ నిర్ణయించింది. అదే విధంగా మైసూర్‌ వర్సిటీ 12 కోర్సులను బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు మాస్టర్స్‌ డిగ్రీ ప్రారంభించింది. ఇదే విధంగా చిన్న యూనివర్సిటీలైన ఓ.పీ జిందాల్‌ గ్లోబల్‌ వర్సిటీ ఐదు కోర్సులను శివనాడార్‌ వర్సిటీ ఎంబీఏ ఆన్‌ లైన్‌ కోర్సును ప్రారంభించింది. అయితే వీరు నిబంధనలకు కట్టుబడి ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి వర్సిటీల నుంచి అఫిడవిట్లు కోరినట్లు యూజీసీ స్పష్టం చేసింది.
నేషనల్‌ అసెస్మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సెల్‌ నుంచి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు 4కు కనీసం 3.01 స్కోరుతో లేదా టాప్‌ 100 జాబితాలో చోటు దక్కించుకున్న విద్యా సంస్థలు.. ఆన్‌ లైన్‌ ప్రోగ్రామ్స్‌ అందించడానికి నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫేస్‌ టు ఫేస్‌ మోడ్‌ లో అందించే కోర్సులను మాత్రమే వర్సిటీలు ఆన్‌ లైన్‌ లో బోధించాలి. లాక్డౌను∙విధించినప్పటి నుంచి ఆన్‌ లైన్‌ విద్య కు ఆదరణ పెరిగింది. ఎట్టకేలకు యూజీసీ డిగ్రీ కోర్సుకు సైతం ఆన్‌లైన్‌ అవకాశం లభించినందుకు, ఈ కోర్సులు భవిష్యత్తులో ఏ ఆటంకాలు రాకుండా కొనసాగుతాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news