భారత్ మురికి దేశం..ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో భాగంగా మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్‌ హట్ హట్ గా కొనసాగింది..వాడివేడిగా చర్చ జరుతుగుతున్న సమయంలో భారత్‌పై మరోసారి విషం కక్కారు ట్రంప్‌.. భారతదేశం మురికి దేశమని.. భారత్‌లో గాలి కూడా మురికిగా ఉంటుందని అన్నారు..పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రస్తావన వచ్చినపుడు ఆయన భారత్, చైనా, రష్యా దేశాలు మురికి దేశాలని అన్నారు. తరవాత భారత్‌ను ప్రత్యేకంగా పేర్కొంటూ ‘అదొక మురికి దేశం, అక్కడ గాలి మురికి’ అని అన్నారు. నిన్న రాత్రి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ మధ్య చివరి, మూడో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు, తాము అనుసరించబోయే విధానాలు సహా కీలక అంశాలపై ట్రంప్, బైడెన్ చర్చ జరపకుండా ట్రంప్‌ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..మరోవైపు మూడో డిబేట్‌ మరింత హుందాగా జరపాలని డిబేట్‌ను పర్యవేక్షించే కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు నియమ నిబంధనలను మారుస్తున్నట్లు ప్రకటించింది. టౌన్‌ హాల్‌ చర్చ రద్దు కావడంతో రాత్రి జరిగిన చివరి చర్చ కాస్త పద్ధతిగా సాగింది. పైగా ప్రశ్నకు రెండు నిమిషాల్లో మాత్రమే సమాధానం ఇవ్వాలన్న షరతుతో ఇద్దరు అభ్యర్థులు కీలక అంశాలకే పరిమితమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version