ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి?

-

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు 200 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 30 మంది వరకూ మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 8 గంటల టైంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ టైంలో బస్సులో 50-55 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

బస్సు అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం వధువు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హరిద్వార్ జిల్లాలోని లాల్ ధంగ్ నుంచి పౌడిలోని బిరోంఖల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రీతూ ఖండూరి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version