జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వాలకు హెచ్చరిక!

-

జర్నలిస్టులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. ప్రభుత్వాలను విమర్శిస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.ఇది ఎంతమాత్రం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్..యూపీ ప్రభుత్వం తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విమర్శిస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎన్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి తీర్పు చెప్పింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ)ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని కోర్టు గుర్తుచేసింది. వాళ్లు రాసే ప్రభుత్వ వ్యతిరేక కథనాలను విమర్శలుగా భావించి క్రిమినల్ కేసులు పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.అలాచేస్తే భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్గించినట్లే అని తెలిపింది.జర్నలిస్ట్ అభిషేక్‌ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర రక్షణ కల్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version