బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ ఎవ‌రంటే..

-

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 మొదలై ఇప్పటికే విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. హేమ – టీవీ 9 జాఫర్ – తమన్నా సింహాద్రి – రోహిణి – అషు రెడ్డి బయటికి వెళ్లారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు హౌస్‌లోకి ఇద్దరు వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవ్వగా… రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఫేడ‌వుట్‌ యాంకర్ శిల్పా చక్రవర్తి వచ్చారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వారం ఎలిమినేషన్ కు ఐదుగురు బిగ్ బాస్ ఇంటి సభ్యులు శిల్పా చక్రవర్తి, మహేశ్ విట్టా, పునర్నవి భూపాళం, హిమజ, శ్రీముఖి నామినేట్ అయ్యారు. రవి కృష్ణ కూడా ఎలిమినేషన్ అయినా కెప్టెన్ హోదాలో బాబా భాస్క‌ర్‌కు ఒక‌రిని సేవ్ చేసే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చారు. బాబా భాస్క‌ర్ త‌న స్నేహితుడు అయిన మ‌హేశ్ విట్టాను సేవ్ చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు.


బాబా అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ రవికృష్ణను సేవ్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని అనధికారిక పోల్స్ ప్రకారం ఈ వారం శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. శిల్ప వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వ‌చ్చినా పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు. మిగిలిన ఇంటి స‌భ్యుల‌కు బ‌య‌ట ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో వాళ్ల‌కు అనుకూలంగా బాగా ఓటింగ్ జ‌రుగుతోంది.

శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎవ్వ‌రిని ఆక‌ట్టుకోలేదు. హౌస్‌లోనూ చాలా మంది ఆమెను వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో ఆమె ఎలిమినేట్ అవుతుంద‌నే ఎక్కువ మంది సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మరోవైపు ఆదివారం రోజు ఎలిమినేట్ అయిన అలీ రేజా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news