బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌: జీరో నుంచి హీరోగా…

-

తెలుగు ప్రేక్ష‌కుల‌ను మూడు నెల‌లుగా ఎంట‌ర్‌టైన్ చేస్తోన్న బిగ్‌బాస్ సీజ‌న్ 3 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. మ‌రొక్క రోజుతో ఈ సీజ‌న్ ముగియ‌నుంది. ఇక ఫైన‌ల్స్‌లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు చాంపియ‌న్ షిఫ్ కోసం పోటీ ప‌డుతున్నారు. కంటెస్టెంట్లు ఫైన‌ల్ రేసులో ఐదుగురు ఉన్నా ఫైన‌ల్ పోరు మాత్రం యాంక‌ర్ శ్రీముఖి, సింగ‌ర్ రాహుల్ సిప్లింగంజ్ మ‌ధ్య మాత్ర‌మే ఉంది.

ఇక హౌస్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పడ్డ పోటీదారు బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్ ఇద్ద‌రు మాత్ర‌మే. అయితే వీరిద్ద‌రు కూడా మొత్తం 17 మంది పోటీదారుల్లో చివ‌రి వ‌ర‌కు ఉండ‌డం నిజంగా గ్రేట్‌. వీరిద్ద‌రు త‌మ న‌డ‌త‌తో బ‌య‌ట ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు సాధించారు. ఇక బాబా భాస్క‌ర్ ఫైన‌ల్స్‌కు చేరుకునే క్ర‌మంలో ఆయ‌నకు అంటూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేక‌పోయినా త‌న‌కున్న మంచిత‌నంతో చ‌వ‌రి వ‌ర‌కు వ‌చ్చారు.

ఇక రాహుల్ సిప్లిగంజ్ కూడా హౌస్‌లో జీరో రేంజ్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైన‌ల్స్‌కు చేరుకున్నాడు. హౌస్‌లో ఉన్న‌వారిలో రాహుల్ చాలా ఓపెన్‌గా ఉంటూ వ‌చ్చేవాడు. అయితే ఇది న‌చ్చ‌ని హౌస్‌మెట్స్‌లో చాలా మంది ముందుగా అత‌డిని వ్య‌తిరేకించారు. అయితే అత‌డి మ‌న‌స్తత్వ‌మే బ‌య‌ట అత‌డిని హీరోను చేసింది. అందుకే చాలా వారాలు అత‌డు నామినేట్ అయినా ప్ర‌తి సారి బ‌య‌ట ప‌డుతూ వ‌చ్చాడు.

ఇక చివ‌ర్లో సైతం నేరుగా ఫినాలే టు టికెట్ సొంతం చేసుకున్నాడు. హౌస్‌లో అంద‌రికంటే ఎక్కువ వారాలు నామినేట్ అయ్యి ఫైన‌ల్‌కు చేరుకుని ముందు నుంచి హాట్ ఫేవ‌రెట్‌గా ఉన్న శ్రీముఖికి గ‌ట్టిపోటీదారుడిగా ఉండ‌డం… ఇప్పుడు ఫైన‌ల్ ఓటింగ్ ముగిసిన వేళ శ్రీముఖి కంటే అత‌డికే ఎక్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్టు ట్రెండ్స్ చెపుతుండ‌డాన్ని బ‌ట్టి చూస్తే రాహుల్ నిజాయితీ, ఓపెన్‌గా ఉండే మ‌న‌స్త‌త్వ‌మే ఈ రోజు అత‌డిని హౌస్‌లో జీరో నుంచి హీరోను చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version