బిగ్‌బాస్ షాక్‌… మిడ్‌నైట్ ఎలిమినేష‌న్‌

-

బుల్లితెర సంచలన రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఈ షోకు స‌ల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ షో టీఆర్పీల ప‌రంగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సీజ‌న్లో కంటెస్టెంట్ల మ‌ధ్య వార్ మామూలుగా లేదు. మొదటి నుంచి కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగుతుండటం.. అటు ప్రేక్షకులకు, ఇటు షో నిర్వాహకులకే కాకుండా సల్మాన్ ఖాన్‌కు కూడా కోపం తెప్పిస్తోంది. కొన్నిసార్లు స‌ల్మాన్ షో మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

 

తాజాగా మరోసారి స‌ల్మాన్ కంటెస్టెంట్ల బిహేవియ‌ర్‌తో పూర్తిగా విసిగిపోయాడు. మొన్న‌టి వీకెండ్‌లో ప్ర‌తి ఒక్క కంటెస్టెంట్‌కు ఫుల్‌గా క్లాస్ పీకిన స‌ల్మాన్ సిద్ధార్థ్ శుక్లాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రష్మీ దేశాయ్, మహీరా శర్మ నిన్ను టార్గెట్ చేస్తున్నారనేది నిజమే కావచ్చు. కానీ వారిని నువ్వు విస్మరించడం నేర్చుకోవాల‌ని సూచించాడు. అలాగే సిద్ధార్థ డేయ్ ప్రవర్తనకు పూర్తిగా సహనం కోల్పోయిన సల్మాన్ ఖాన్ అత‌డిని తిట్టేందుకు బండ బూతులు కూడా వాడాడు.

అలాగే షెహ‌నాజ్‌కు క్యారెక్ట‌ర్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి నువ్వ ఎవ‌రు ? అని కూడా మండిప‌డ్డాడు. అయితే అంద‌రికి అదిరిపోయే షాక్ ఇస్తూ స‌డెన్‌గా మిడ్ నైట్ ఎలిమినేష‌న్ ప్ర‌క‌టించాడు. మిడ్ నైట్ ఎలిమినేషన్ అనౌన్స్ చేసిన బిగ్ బాస్.. సిద్ధార్థ డేయ్‌ను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో వీక్ష‌కులు కూడా స‌ల్మాన్‌ను మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు ఎలా ?  ప్ర‌వ‌ర్తించాలో ?  స‌ల్మాన్‌కు బాగా తెలుసు అని అందుకే ఎవ‌రైనా త‌ప్పు చేస్తే స‌ల్మాన్ ఎంత మాత్రం ఊరుకోడ‌ని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news