అట్ట‌ర్‌ప్లాప్ దిశ‌గా బిగ్‌బాస్ -3

-

తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ ఎంతో ఆశ‌తో ఉన్న బిగ్‌బాస్ -3 షో డిజాస్ట‌ర్ దిశ‌గా వెళుతున్న‌ట్టే ఆ షోకు వస్తోన్న రేటింగ్‌లు చెపుతున్నాయి. కార్తీక‌దీపం సీరియ‌ల్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంటే బిగ్‌బాస్ -3 చ‌తికిల‌ప‌డుతోంది. ఇంత ఖ‌ర్చు పెట్టి చేస్తోన్న ఈ షోకు ఆశించిన రేంజ్లో రేటింగులు రావ‌డం లేద‌న్న‌ది నిజం. తెలుగులో బిగ్‌బాస్ -3కు పెట్టిన బ‌డ్జెట్‌తో ఓ 10 చిన్న సినిమాలు తీసేయొచ్చు.


తొలి రెండు సీజ‌న్ల‌తో పోలిస్తే బెట‌ర్ రేటింగులు రాక‌పోవ‌డ‌తో ఏం చేయాలా ? అని బిగ్‌బాస్ యాజ‌మాన్యం కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి ఎప్పుడు వ‌చ్చిందో ? ఎప్పుడు వెళ్లిందో కూడా ?  ఎవ‌రికి తెలియ‌దు. ఆమెను ప‌ర‌మ చెత్త కార్డు ఎంట్రీ అని అంద‌రూ అస‌హ్యించుకున్నారు.

చివ‌ర‌కు మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఊరించారు. ఓ హాట్ హీరోయిన్ అంటూ లీకులు ఇచ్చారు. శ్రద్ధాదాస్ వస్తుందనుకున్నారు. హెబ్బా పటేల్ పేరు గట్టిగా వినిపించింది. ఆఖరి నిమిషంలో ఈషా రెబ్బా అన్నారు. చివ‌ర‌కు ఆ స్థానంలో పాత యాంకర్ శిల్పా చక్రవర్తిని పంపించారు. ఆమె యాంక‌రింగ్ ఎప్పుడో ?  మానేసింది… జ‌నాలు కూడా మ‌ర్చిపోయారు. హాట్ హీరోయిన్ హౌజ్ లోకి వస్తుందనుకుంటే.. ఇలా ఫేడ్ అవుట్ యాంకర్ ను పంపించి అందరి ఉత్సాహాన్ని నీరుగార్చారు.

ఆమెను ముందుగా చీక‌ట్లో చూపించ‌డంతో బాబా భాస్క‌ర్ అయితే ఏకంగా రెజీనా వ‌చ్చిన‌ట్లుందే అన్న సందేహం వ్య‌క్తం చేశారు. కంటెస్టెంట్లు కూడా హీరోయిన్ వ‌స్తుంద‌నుకుంటే చివ‌ర‌కు వాళ్ల‌కు కూడా షాక్ త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు అంద‌రూ మ‌ర్చిపోయిన పాత యాంక‌ర్ శిల్పా చ‌క్ర‌వ‌ర్తి రావ‌డంతో కంటెస్టెంట్లు కూడా ఓస్ ఇంతేనా అనుకున్నారు. శిల్ప ఎంట్రీతో హౌస్‌లో ఉత్సాహం కాస్తా నిరుత్సాహంగా మారింది. ఇప్ప‌టికే తొలి వైల్డ్ కార్డ్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఇక రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే తుస్సుమంది.. మ‌రి బిగ్‌బాస్ 3ను దేవుడు ఏ ద‌రికి చేరుస్తాడో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version