Bigg Boss Telugu 3: హేమ ఔట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

-

మొదటి వారం నామినేషన్లలో ఉన్న హిమజ, పునర్నవి, రాహుల్, వితిక, జాఫర్, హేమ… ఈ ఆరుగురిలో.. హిమజకు ఎక్కువ ఓట్లు పడగా.. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు పునర్నవికి, తర్వాత రాహుల్ కు, ఆ తర్వాత వితికకు, జాఫర్ కు పడ్డాయి.

అనుకున్నట్టే జరిగింది. అందరూ హౌస్ నుంచి వెళ్లిపోయే మొదటి కంటెస్టెంట్ హేమ అయి ఉంటుందని అంతా భావించారు. అనుకున్నట్టుగానే హేమ ఎలిమినేట్ అయింది. అత్యంత తక్కువ ఓట్లు హేమకే వచ్చాయి. దీంతో హేమ బిగ్ బాస్ హౌస్ ను విడిచి పెట్టక తప్పలేదు.

bigg-boss-telugu-season-3-episode-8-highlights

మొదటి వారం నామినేషన్లలో ఉన్న హిమజ, పునర్నవి, రాహుల్, వితిక, జాఫర్, హేమ… ఈ ఆరుగురిలో.. హిమజకు ఎక్కువ ఓట్లు పడగా.. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు పునర్నవికి, తర్వాత రాహుల్ కు, ఆ తర్వాత వితికకు, జాఫర్ కు పడ్డాయి.

విచిత్రం ఏంటంటే.. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు. హౌస్ లో గుడ్, యావరేజ్, బ్యాడ్ అని అనుకునే వ్యక్తుల పేర్లు చీటీపై రాయలంటూ నాగ్ చెప్పగా… మంచి వ్యక్తి అంటూ ఎక్కువ మంది బాబా భాస్కర్ పేరు రాశారు. యావరేజ్ వ్యక్తి అంటూ జాఫర్ పేరు రాయగా… బ్యాడ్ అంటూ చాలా మంది హేమ పేరే రాశారు.

అంటే.. ఆడియన్స్ పల్స్, ఇంట్లోని సభ్యుల పల్స్ ఒకే విధంగా ఉండటం నిజంగా షాకింగ్ కు గురి చేసేదే. మొత్తానికి హేమ పెత్తనాన్ని భరించలేక అటు ఇంటి సభ్యులు, ఇటు ఆడియెన్స్ హేమను ఇంటికి పంపించేశారు.

ఈ ఎపిసోడ్ లో నాగార్జునే హైలెట్. ఆయన షోను నడిపించిన విధానం బాగుంది. మిగితా సీజన్ల హోస్ట్ ల కన్నా నాగ్ బాగా చేస్తున్నాడు. ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. ఇంటి సభ్యులు కూడా నాగ్ తో చాలా సరదాగా ఉంటూ ఎపిసోడ్లను రక్తి కట్టిస్తున్నారు.

మొత్తం ఇంటి సభ్యుల్లోని 15 మందిలో హేమ బయటికి వెళ్లిపోగా… ప్రస్తుతం ఇంట్లో ఉన్నది కేవలం 14 మంది. కానీ.. బిగ్ బాస్ మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒకరిని హౌస్ లోపలికి పంపించబోతున్నాడు.

తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ


తమన్నా అంటే హీరోయిన్ తమన్నా అనుకునేరు. కాదు… తను ఓ ట్రాన్స్ జెండర్. పూర్తి పేరు తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ షో లో మొదటి సారి ఓ ట్రాన్స్ జెండర్ కు అవకాశం ఇచ్చారు. తనను ప్రేక్షకులకు నాగ్ పరిచయం చేశాడు. కాకపోతే ఆమె ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేది ఇంకా చెప్పలేదు. మేబీ.. ఆమె సోమవారం ఇంట్లోకి వెళ్లే చాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news