అరె.. ప్రాణంతో కొట్టుకున్న చికెన్ ముక్క.. వైరల్ వీడియో

1027

చికెన్ ముక్క ప్రాణంతో కొట్టుకుంటూ లేచి కింద పడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం దాని గురించే చర్చ.

మీరు ఎప్పుడైనా కోడిని కోస్తుండగా చూశారా? కోడి మెడను తప్పించాక.. దాన్ని కోస్తుంటే కూడా దాని శరీరం నుంచి కొన్ని కదలికలు ఉంటాయి. అంటే.. దాని ప్రాణం ఇంకా పూర్తిగా ఆ శరీరాన్న వదల్లేదన్నమాట. అయితే.. ముక్కలు ముక్కలుగా కట్ చేశాక మాత్రం దాని ప్రాణం ఉండదు.

raw chicken jumps off plate video goes viral

కానీ.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే… రెస్టారెంట్ లో టేబుల్ పై వండటానికి సిద్ధంగా ఉంచిన చికెన్ లోని ఓ ముక్క ప్రాణంతో లేచి ఎగిరి కింద పడిపోతుంది. దాన్ని చూసిన చెఫ్ బయపడి అరుస్తాడు.

చికెన్ ముక్క ప్రాణంతో కొట్టుకుంటూ లేచి కింద పడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం దాని గురించే చర్చ. ఫ్లొరిడాకు చెందిన రీ ఫిలిప్స్ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.