మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ… ఐదు బెల్స్ మాత్రమే మోగుతాయని.. ఒక బెల్ మోగగానే వెంటనే శివజ్యోతిని నామినేట్ చేస్తున్నట్టు రాహుల్ తెలిపాడు. అయితే.. శివజ్యోతిని నామినేట్ చేయడానికి సరైన కారణాలు చెప్పనందున మానిటర్ హేమ.. రాహుల్ నే నామినేట్ చేస్తున్నాడు తెలిపింది.
బిగ్ బాస్ సీజన్ 3 గత ఆదివారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే.. షో ప్రారంభం అయిన మొదటి రోజే ఆరుగురు కంటెస్టెంట్లను నామినేట్ చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు బిగ్ బాస్. రాహుల్, జాఫర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు, బాబా భాస్కర్ ను ఎలిమినేషన్ రౌండ్ కు సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్.
అయితే.. వాళ్లకు ఒక చాన్స్ ఇచ్చాడు. మిగితా ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరిని తమ బదులు నామినేట్ చేసి వాళ్లను ఎందుకు నామినేట్ చేశారో సరైన కారణం మానిటర్ హేమకు చెప్పాలని బిగ్ బాస్ చెప్పడంతో.. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఇదే తంతు జరిగింది.
మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ… ఐదు బెల్స్ మాత్రమే మోగుతాయని.. ఒక బెల్ మోగగానే వెంటనే శివజ్యోతిని నామినేట్ చేస్తున్నట్టు రాహుల్ తెలిపాడు. అయితే.. శివజ్యోతిని నామినేట్ చేయడానికి సరైన కారణాలు చెప్పనందున మానిటర్ హేమ.. రాహుల్ నే నామినేట్ చేస్తున్నాడు తెలిపింది.
రెండో బెల్ మోగగానే… వరుణ్ సందేశ్… పునర్నవిని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఆమె ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడదని… ఒంటరిగా ఉంటుందని.. అందుకే ఆమెను నామినేట్ చేసినట్టు వరుణ్ తెలిపాడు. దీంతో హేమ కూడా వరుణ్ ను సేవ్ చేసి పునర్నవిని నామినేట్ చేసింది.
మూడో బెల్ కు వితికా షేరు… అషూరెడ్డిని నామినేట్ చేస్తున్నట్టు చెప్పినా.. సరైన కారణాలు లేక వితికానే నామినేట్ చేసింది హేమ.
నాలుగో బెల్ మోగిన తర్వాత.. శ్రీముఖి… హిమజను నామినేట్ చేసింది. అయితే.. ఈ సమయంలో హిమజ, శ్రీముఖి మధ్య మాటల యుద్ధం జరిగింది. హిమజ కాసేపు కన్నీరు కూడా పెట్టుకుంది. అయితే.. హిమజపై ఓ రెడ్ మార్క్ ఉందని.. తను ఏ పని అయినా లైట్ తీసుకుంటుందని శ్రీముఖి.. హిమజను నామినేట్ చేసినట్టు చెప్పింది.
అయితే.. తానేది లైట్ తీసుకోనని… తనకు ఉన్న రెడ్ మార్క్ పోవాలని ఉదయమే లేచి పని కూడా చేశానని చెప్పినప్పటికీ.. సరైన కారణాలు లేవని.. శ్రీముఖిని సేవ్ చేసి హిమజను నామినేట్ చేసింది హేమ.
చివరి బెల్ ఐదోది మోగగానే… జాఫర్.. మహేశ్ విట్టాను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే.. మహేశ్ మాత్రం.. తాను బిగ్ బాస్ హౌస్ లో ఉంటే అన్ని యాక్టివిటీస్ లో పాలు పంచుకుంటానని.. యాక్టివ్ గా ఉంటానని చెప్పడంతో… జాఫర్ నే నామినేట్ చేసి మహేశ్ విట్టాను సేవ్ చేసింది హేమ.
చివరి బెల్ కూడా మోగడం అయిపోవడంతో… బాబా భాస్కర్ మాత్రమే మిగిలిపోయారు. దీంతో ఆయనకు కూడా బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చారు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. బాబా భాస్కర్, మానిటర్ హేమ.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే సేవ్ చేయాలని బిగ్ బాస్ ఇంటిసభ్యులకు తెలపడంతో.. ఇంటి సభ్యులంతా ఓ నిర్ణయం తీసుకొని… బాబా భాస్కర్ ను సేవ్ చేశారు. హేమను నామినేట్ చేశారు. అలా.. మొదటి రోజే మానిటర్ అయి.. ఆ తర్వాత ఎలిమినేషన్ లిస్ట్ లోకి చేరిపోయింది హేమ. మొత్తం మీద రెండో ఎపిసోడ్ లో ఈ తతంగమే జరిగింది. ఈవారం ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్న కంటెస్టెంట్లు.. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమ. వీరిలో ఎవరో ఒకరు ఈవారం ఇంటి నుంచి వెళ్లిపోబోతున్నారు.