2024-25 బడ్జెట్ లో ఇక్రా అంచనా ఇదే..!

-

2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం కాపెక్స్‌ కోసం రూ.10.2 లక్షల కోట్లు మాత్రమే కేటాయించే ఆస్కారం ఉన్నదని ఇక్రా అంటోంది. మూలధన పెట్టుబడిలో స్వల్ప వృద్ధి ప్రభావం ఆర్థిక కార్యకలాపాల పైన, జీడీపీ పైన ఉండవచ్చునంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబరు నెలల మధ్య కాలంలో క్యాపెక్స్‌ 31 శాతం పెరిగి రూ.5.9 లక్షల కోట్లకు చేరింది. 2024 సంవత్సరపు బడ్జెట్‌ అంచనాల కన్నా ఇది 58.5 శాతం అధికం. వృద్ధి అత్యధికంగా ఉన్న కారణంగా పెట్టుబడి వ్యయాలు 2023 అక్టోబరులో 14.9 శాతం తగ్గాయి.

గత ఏడాది ఏప్రిల్‌ తర్వాత ఇదే తొలి క్షీణత. కాగా నవంబరులో మాత్రం 1.6 శాతం పెరిగాయి. నెలవారీ సగటు క్యాపెక్స్‌ రూ.73,210 కోట్లు ఉంది. బడ్జెట్ లో నిర్దేశించిన రూ.10 లక్షల కోట్ల లక్ష్యం చేరాలంటే నెలవారీ సగటు రూ.83,400 కోట్లు ఉండాలి. భారత దేశం మౌలికంగా ఇన్‌ఫ్రా కొరత ఉన్న దేశం. ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇటీవల వృద్ధి పుంజుకోవడంతో కొన్ని రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకున్నాయి. వాటిలో స్టీల్‌, సిమెంట్‌, పెట్రోలియం రంగాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version