స్కూల్‌లోనే ఎంఎస్ ధోనీ ఫ‌స్ట్ ల‌వ్‌..

-

ధోనీకి వీళ్ల కంటే ముందు మరో ప్రేయసి ఉండేదట. ఆమె తన తొలి ప్రేయసట. ఐపీఎల్ 2018 సమయంలో ధోనీ ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తన తొలిప్రేమ జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు.

ఎంఎస్ ధోనీది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలిసిందే. కానీ.. ఆయన తన భార్య సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ముందే మరో అమ్మాయిని ప్రేమించాడని ఎంఎస్ ధోనీ సినిమాలో చూపించారు. ఆ అమ్మాయి యాక్సిడెంట్‌లో చనిపోతుంది. తర్వాత ఆమె జ్ఞాపకాల్లో కొన్నేళ్లు గడిపిన ధోనీకి సాక్షి పరిచయం అవుతుంది. తర్వాత సాక్షితో పెళ్లవుతుంది.

అయితే.. ధోనీకి వీళ్ల కంటే ముందు మరో ప్రేయసి ఉండేదట. ఆమె తన తొలి ప్రేయసట. ఐపీఎల్ 2018 సమయంలో ధోనీ ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తన తొలిప్రేమ జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. తను స్కూల్‌లో చదివేటప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడట ధోనీ. కాకపోతే ఆ అమ్మాయిని 12వ తరగతిలో ఉన్నప్పుడు చివరి సారిగా కలిశాడట. మళ్లీ ఇప్పటి వరకు ఆ అమ్మాయి ముఖం కూడా చూడలేదట ధోనీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version