మహేంద్ర సింగ్ ధోనీ భారత దేశ క్రికెట్ చరిత్ర దిశను మార్చిన పేరిది.. కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. 1981 జూలై 7 న జన్మించిన ధోనీ క్రికెట్ అరంగేట్రం గాని పర్సనల్ లైఫ్‌గానీ అంత సులువుగా ఏం సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రాటు దేలిన జార్ఖండ్ డైనమైట్ అతను. 2000 సవంత్సరంలో భారత క్రికెట్లో ఒక రకమైన పరిస్థితి.. సరైన వికెట్ కీపర్ లేక రాహుల్ ద్రావిడ్ కీపింగ్ చెయ్యాల్సిన పరిస్థితి.. పార్థీవ్ పటేల్, దినేష్ కార్తిక్ లాంటి వారిని సెలక్ట్ చేసినా పెద్దగా ఉపయోగం లేదు.
2004/05 బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే వన్డే జట్టుకు ధోనీ ఎంపికయ్యాడు. తన తొలి వన్డేలో సున్న పరుగులు మాత్రమే ధోనీ ఖాతాలో పడ్డాయి.. అంటే డకౌట్ అయ్యాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయినా కీపింగ్ శైలి నచ్చి ధోనీని పాకిస్తాన్ సిరీస్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు.
పాకిస్తాన్ తో మ్యాచ్ అది ధోనీకి 5వ వన్డే.. పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే తెలుసు కదా ఎంత ఒత్తిడి ఉంటుందో.. అప్పటికి పెద్దగా రాణించలేని ధోని సచిన్ 2 పరుగులకు ఔట్ అవ్వడంతో బ్యాటింగ్‌కి వచ్చాడు.. ఆ మ్యాచ్‌లో విజృంబించిన ధోని 123 బంతులలో 148 పరుగులు చేశాడు. భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు ధోని. తురువా 2005 నవంబర్‌లో శ్రీలంక సిరీస్‌లో 183 పరుగులు చేసి భారత్‌ని గెలిపించాడు. ఆ సిరీస్‌లో ధోనీ 346 పరుగులు చేసి తన సత్తా చాటాడు..
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లలో ధోనీ విఫలం కావడంతో ధోనీపై విమర్శలు వెలువెత్తాయి. ధోనీ కీపింగ్ సామర్థ్యంపై కూడా విమర్శలు వచ్చాయి. వెస్టిండీస్, శ్రీలంకలపై ఇండియా 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ధోనీ 100కి పైగా సగటుతో విజృంభించాడు. ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లను ఎంపికలో ధోనీ పేరు ఎంపిక చేశారు సెలక్టర్లు… లీగ్ దశలోనే ఇండియా పేలవమైన ప్రదర్శనతో వరల్డ్ కప్ నుండి నిష్ర్కమించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఓడిపోవడంతో ధోనీ ఇంటి దాడి జరిగింది.
తరువాత బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 91 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు ధోనీ. ఛేజింగ్‌లో భారత్ పటిష్టంగా మారిందంటే ధోనీ పాత్ర చాలా కీలకం.
ఇక తరువాత సిరీస్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు ధోనీని వరించాయి..
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్‌లకు ధోనీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. 2007 సెప్టెంబర్ టీ20 వరల్డ్ కప్‌కి కెప్టెన్సీ చేసిన ధోనీ ట్రోఫీతో తనలోని నాయకుడ్ని పరిచయం చేశాడు. ఇక మ్యాచ్ మ్యాచ్‌కి రాటు దేలుతూ టీమ్‌ని కూడా పటిష్టవంతంగా తీర్చిదిద్దాడు.. ఎంత ఒత్తిడిలోనైనా కూల్ ఉండటం ధోనీ ప్రత్యేకత అందుకే ధోనీని మిస్టర్ కూల్ అని పిలుస్తారు. 2011 వరల్డ్ కప్ విజయం సాధించడం ధోనీని తిరుగులేని నాయకుడిగా చెసింది. 2017లోవన్డే, టీట్వంటీ కెప్టెన్సీని విరాట్ కోహ్లీ అప్పగించాడు ధోనీ. 2019 వరల్డ్ కప్‌లో కూడా తన భాద్యతను నిర్వర్తిస్తూ..
టీమ్ ఇండియా కోసం ఇంతలా కష్టపడ్డ మహేంద్రసింగ్ ధోనీ ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్ కావొచ్చు..
Images Source : sportslibro
MS DHONI’s Record As an INDIAN Captain
Foramat | Matches | Won | Lost | Drawn | Tied | Won% |
TEST | 60 | 27 | 18 | 15 | 0 | 45.00 |
ODIs | 199 | 110 | 74 | 0 | 4 | 55.28 |
T20Is | 72 | 41 | 28 | 0 | 1 | 56.94 |
Total | 331 | 178 | 120 | 15 | 5 | 53.78 |