Independence Day: ఇండిపెండెన్స్ డే గురించి మీకు తెలియని నిజాలు..!

-

Independence Day: ఆగస్ట్ 15, 1947.. భారతావని దాస్య శృంఖలాల నుంచి విముక్తి అయిన రోజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకుల ప్రబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజు. ఎందరో త్యాగమూర్తులు, ఎందరో పోరాటల ఫలితంగా మాతృభూమికి ఈ స్వతంత్రం దక్కింది. దాదాపు 200 ఏళ్ల వలస పాలనలో బానిసత్వంలో మగ్గిన దేశ ప్రజలకు విముక్తి దొరికింది.

75th Independence Day

ఈ ఆగస్టు 15 తో భారతనికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు పూర్తవుతుంది. 77వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు దేశం ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ డే గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలను తెలుసుకుందాం.. న్యూఢిల్లీలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో మహాత్మా గాంధీ పాల్గొనలేదు. ఆ సమయంలో ఆయన కలకత్తాలో ఉన్నారు. భారతదేశానికి, పాకిస్తాన్ కి మధ్య జరిగే వివాదాలకు బీజాలు కూడా ఈ రోజే పడ్డాయి.

ఆగస్టు 15, 1947న బంకించంద్ర చటర్జీ వందేమాతరం పాడిన తర్వాత భారత శాసనమండలి పనిచేయడం ప్రారంభించింది. అయితే ఆ రోజుకి జాతీయ గీతం ఇంకా లేదు. 1950లో జాతీయ గీతం ఆమోదించబడింది. మన జాతీయ పతాక మొదటి రూపాంతరాన్ని 1921లో స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు. ఈ జెండా మధ్య గీతపై 24 చుక్కల అశోక చక్రంతో ఆరెంజ్, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కలిగి ఉంది. ఇది జూలై 22, 1947న స్వీకరించి.. ఆగస్ట్ 15, 1947న ఎగరవేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version