అవును.. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభం అయిందంటే దాని వెనుక ఉన్నది ఎవరో కాదు.. మన ప్రధాని నరేంద్ర మోదీ. యోగా అనేది భారత్ కు సంబంధించిన విద్య. అది ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది.
యోగా చేయడం వల్ల వచ్చే సత్ఫలితాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా యోగా డేను నిర్వహించాలని ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించారు. యోగాను విశ్వవ్యాప్తం చేసే గురుతర బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు. దీంతో ఐక్యరాజ్యసమితి కూడా ప్రధాని మోదీ ప్రతిపాదనను వెంటనే ఆమోదించి 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న జరుపుకోవడానికి అనుమతించింది.
జూన్ 21… సంవత్సరంలోనే అత్యంత ఎక్కువ పగటి సమయం ఉండే రోజు. అందుకే… జూన్ 21ని ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది.