International Yoga Day: అంతర్జాతీయ యోగా డే గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

-

యోగా గురించి ప్రపంచానికి తెలియజేసింది మాత్రం భారత్ అని చెప్పాలి.మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది..యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది. యజ అంటే దేనినైనా ఏకం చేయగలగడం అని అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అని అర్థం ఉంది. ఈ రెండింటిని కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. మనస్సును,శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మిక తాదాత్మ్యం అందించేదే యోగా అని చెబుతారు. భారతదేశంలో వేద కాలం నుంచే యోగ ఉందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. పరమ శివుడు మొదట తన పత్ని పార్వతికి యోగా గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

 

సెప్టెంబర్ 27,2014న అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ముందు పెట్టారు.అందుకు 193 ఐరాస మద్దతు లభించడంతో అప్పటినుంచి అంతర్జాతీయ యోగాను జూన్ 21న నిర్వహిస్తున్నారు. ఆరోజున అన్ని దేశాలు యోగా డేగా పాటిస్తున్నాయి. ఇదే రోజున యోగా జరుపుకోవడానికి మరో ముఖ్య కారణం…ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు జూన్ 21వ తేదీ. పగటి సమయం ఎక్కువగా ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో.. అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.

 

ఈ మేరకు జూన్ 21,2015న ప్రపంచమంతా మొదటిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది..ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఆ వేడుకలను నిర్వహించారు.84 దేశాల నుంచి వచ్చిన నేతలు అందులో పాల్గొన్నారు.మొత్తం 35,985 మంది యోగా చేసి గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పారు. అప్పటినుంచి ప్రతీ ఏటా భారత్‌లో ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆనవాయితీగా అందులో పాల్గొంటున్నారు.

గతేడాది కరోనా కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఎవరి ఇళ్లల్లో వారే యోగా చేయాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. ‘క్షేమం కోసం యోగా’ అనే థీమ్‌తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపనున్నారు..నేడు ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము..యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి..ప్రతి ఒక్క ఆసనం కూడా మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతుంది..ఈరోజు ప్రతి ఒక్కరూ యోగాను చేస్తున్నారు. భారత ప్రధాని మోదీ ఈరోజు యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version