రాఖీ అంటే అన్నకి కదా? మరి భర్తకి కడతారా? తెలిసుకోండి అసలు విషయం!

-

రాఖీ పండుగ హిందూ సాంప్రదాయంలో అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమ కు రక్షణ కు ప్రతీకగా జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ. ఈ పండుగలో సోదరీమణులు తమ సోదరుల కు రాఖీ కట్టి వారి ఆయుష్షును, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణుల రక్షణ గా వుంటాను అని వాగ్దానం చేస్తారు. అయితే రాఖీ నీ భర్తకు కట్టవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.ఇది కొన్ని ప్రాంతాలలో పాటిస్తున్నారు ..అవును మీరు విన్నది నిజమే .. మరి ఈ విషయం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ..

రాఖీ పండుగ హిందూ ఆచారం ప్రకారం సోదరుడు లేదా సోదర సమానమైన వ్యక్తికి రాఖీ కట్టే ఆచారం ఉంటుంది. ఈ రాఖీ సోదర బంధానికి చిహ్నం ఇది ప్రేమ గౌరవం, రక్షణకు సూచిస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ పండుగలో రాఖీ కట్టడం ద్వారా సోదరీమణులు తమ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ..

Rakhi for Brothers... or Husbands Too? Here's the Truth Behind the Tradition!

భర్తకు రాఖీ కట్టొచ్చా అంటే సాధారణంగా రాఖీని భర్తకు కట్టే ఆచారం హిందూ సంప్రదాయంలో లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇటువంటి సాంప్రదాయం ఎక్కడ కనిపించదు.ఇక్కడ భర్తతో ఉన్న సంబంధం భార్యాభర్తల మధ్య ప్రేమ భాగస్వామ్యం బాధ్యతలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల పవిత్ర బంధానికి ప్రతీకైన రాఖి కేవలం సోదరులకే కాకా భర్తకు రాఖీ కట్టే ఆచారాన్ని మనము చూడొచ్చు అది ఎక్కడ అంటారా.. మధ్యప్రదేశ్ లోని చిద్వాడ, పలు ప్రాంతాల్లో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇంద్రుడికి భార్య ఇంద్రాణి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. పెళ్లంటే బాధ్యత భార్యకు ఒక రక్షకుడిలా తోడుంటానని భర్త చేసే వాగ్దానం అని గుర్తు చేస్తూ మధ్యప్రదేశ్లో చిద్వాడా గ్రామంలో మహిళలు భర్తలకు రాఖీ కడుతున్నారు

హిందూ సంప్రదాయంలో అయితే ఇలాంటి ఆచారాలు మనం చూడం . ఇది సాంప్రదాయబద్ధం కాదు సామాజికంగా ఇది ఇంకా ఎవరు ఆమోదించలేదు. కొన్ని ప్రాంతాల్లో సోదరులు లేని స్త్రీలు దేవతలకు కృష్ణుడికి శివుడికి లేదా ఏ దేవుణ్ణి అయితే వాళ్ళు సోదరుడిగా భావిస్తారో అటువంటి దేవుళ్ళకి రాఖీ కట్టే ఆచారం ఉంది ఉదాహరణకు మహారాష్ట్రలో కొందరు సముద్ర దేవత వరుణుడికి రాఖీ కట్టి సముద్రాన్ని పూజిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news