కేటీఆర్‌కు రాఖీ కట్టారు లగచర్ల ఆడబిడ్డ జ్యోతి, గిరిజన మహిళలు. ఈ సందర్బంగా లగచర్ల ఆడబిడ్డ జ్యోతి మాట్లాడారు. తన భర్తను ప్రభుత్వం అక్రమంగా జైలుకు పంపినప్పుడు కేటీఆర్ అన్న లెక్క నిలబడ్డాడని అని తెలిపారు. గర్భిణిగా ఉన్నప్పుడు నా క్షేమాలన్నీ చూసుకొని, నా బిడ్డకు మేనమామ లెక్క భూమి నాయక్ అని పేరు పెట్టాడని వివరించారు.

ఆపదలో నాకు దేవుడు ఇచ్చిన అన్న కేటీఆర్ అని రాఖీ కట్టారు లగచర్ల ఆడబిడ్డ జ్యోతి. కాగా లగచర్ల బాధిత మహిళ జ్యోతి కూతురికి భూమి నాయక్ అని నామకరణం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.