రాఖీ పూర్ణిమ.. పండగ విశేషాలు.. సందేశాలు..

-

రాఖీ పూర్ణిమ

అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ అనుబంధాన్ని తెలియజేసే పండగ రాఖీ పూర్ణిమ. అక్కా, చెల్లె.. తమ సోదరులకు రాఖీ కట్టీ తమకు బలాన్నివ్వాలని కోరుకుంటారు. నేను నీకు రక్షగా ఉంటానన్న నమ్మకాన్ని సోదరులు ఇస్తుంటారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ పండగ ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన జరుపుకుంటున్నారు.

రాఖీ పండగకి చాలా విశిష్టత, చరిత్ర ఉంది. ఆంత్రోపాలజీ ప్రకారం రాఖీ పండగ పుట్టుక పల్లెల్లో మొదలైంది. పెళ్ళయ్యాక ఆడపిల్లలు భర్త ఇంటికి వెళ్తారు. కావున, ఈ ప్రత్యేకమైన రోజున అమ్మ వాళ్ళింటికి వస్తుంటారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధం ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్ళినా కూడా అంతే బలంగా ఉండాలన్న లక్ష్యంతో పండగ జరుపుకుంటారు..

ఈ రోజున అక్కలు, చెల్లెల్లు తమ అన్నా తమ్ముళ్ళకు రాఖీలు కడతారు. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్ళకు బహుమతిగా అన్నాదమ్ములు ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. రోజు వారి జీవితంలో ఇలాంటి పండగలు, సాంప్రదాయాలు ఒక ఆటవిడుపు లాంటివి.

రాఖీ పండగ రోజున మీ అక్కాచెల్లెళ్ళకు, అన్నా తమ్ముళ్ళకు పంపించాల్సిన సందేశాలు

నా మొదటి స్నేహానివి నువ్వు, అమ్మా నాన్నలో సగభాగానివి నువ్వు. నిన్ను వదిలి దూరంగా ఉంటున్నా కూడా నువ్వు నా నుండి దూరం కాలేవు. నా పిల్లలు ఆడుతున్నప్పుడు నువ్వు నేను ఆడుకున్న క్షణాలు గుర్తొచ్చి కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. రాఖీ పండగకి ఇంటికి వచ్చి నీ మణికట్టుకు రాఖీ కడతా అన్నా.. అప్పుడు గానీ నా కన్నీళ్ళు ఆగేలా లేవు.

జీవితంలో ఎన్నో కోల్పోతుంటాం.. ఎన్నో పోగు చేసుకుంటూ ఉంటాం. కానీ, నీ ప్రేమ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. రాఖీ పండగ శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version