రాఖీ పౌర్ణమిని ‘బలేవా’ అని కూడా పిలుస్తారు తెలుసా?

తన సోదరుడి చేతికి రాఖ కట్టి.. తను పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి. అలాగే.. తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునేలా.. వాళ్లిద్దరి మధ్య ఉండే ప్రేమ బంధాన్ని రాఖీ పండుగ గుర్తు చేస్తుంది.

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. ఆన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు తెగ ఆనందిస్తారు. ఎందుకంటే ఇది సోదరసోదరీమణుల మధ్య ఉన్న బంధాన్ని ఓసారి గుర్తు చేస్తుంది. ఇది సోదర బంధం. అందుకే దీన్ని రక్షా బంధనం అని పిలుస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. సోదరి ప్రేమకు ఈ పండుగ చిహ్నం.

raskha bandhan reminds the relationship of brother and sister

తన సోదరుడి చేతికి రాఖ కట్టి.. తను పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి. అలాగే.. తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునేలా.. వాళ్లిద్దరి మధ్య ఉండే ప్రేమ బంధాన్ని రాఖీ పండుగ గుర్తు చేస్తుంది.

అయితే.. ఈ రాఖీ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరి ఆచారం ఇది. అంటే.. దానికి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముందుగా మనం రాఖీ పౌర్ణమి పండుగ ఆవిర్భవించడానికి కారణమైంది ఇదే.. అని ప్రాచుర్యంలో ఉన్న ఓ విషయాన్ని తెలుసుకుందాం.

నిజానికి రాఖీ పౌర్ణమిని బలేవా అని పిలుస్తారు. బలేవా అంటే బలి రాజు భక్తి అని అర్థం. బలి చక్రవర్తి.. విష్ణువు భక్తుడు. తనపై ఉన్న విపరీతమైన భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకుంటాడు బలి చక్రవర్తి. దీంతో వైకుంఠంలో విష్ణువు లేక వెలవెల బోతుంది.

raskha bandhan reminds the relationship of brother and sister

దీంతో విష్ణువు భార్య లక్ష్మీదేవి ఎలాగైనా విష్ణువును వైకుంఠానికి తిరిగి తీసుకురావాలని ఓ ఆలోచన చేస్తుంది. బలిచక్రవర్తికి ఒక రక్షా బంధన్ కడుతుంది. దీంతో బలి చక్రవర్తి మనసు కరిగిపోయి.. నీకు ఏం కావాలమ్మా.. అని అడుగుతాడు. వెంటనే లక్ష్మీ.. తనకు విష్ణుమూర్తి కావాలని కోరుతుంది. దీంతో బలి చక్రవర్తి.. విష్ణుమూర్తిని తన వెంట తీసుకెళ్లాలంటూ లక్ష్మీదేవితో చెబుతాడు. అలా రక్షా బంధన్ వెలుగులోకి వచ్చినట్టు చరిత్రకారులు చెబుతుంటారు.

ఏది ఏమైనా.. ఏ కథ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ.. రాఖీ పౌర్ణమి అనేది ప్రతి అన్నా, చెల్లి, అక్కా, తమ్ముడికి ఎంతో ప్రాధాన్యమైన పండుగ. వాళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఆ పండుగ నిదర్శనం. ఆ ప్రేమను అనుభూతి చెందడం తప్పితే వివరించలేం.