తెలంగాణ దారులన్నీ పూలదారులుగా మారాయి : సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించి తొమ్మిదో విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుమ్మలూరులోని అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం హరితోత్సవంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

“8 ఏళ్లుగా ఎంతో కృషి చేసి రాష్ట్రంలో పచ్చదనం పెంచుతున్నాం. దేశంలోనే ఎక్కువ వరి పండించే రాష్ట్రం మనదే. నేను హరితహారం అంటే గతంలో నేతలు, అధికారులకు అర్థం కాలేదు. హరితహారాన్ని చాలామంది హాస్యాస్పదం చేశారు.. కాంగ్రెస్ నేతలు జోకులు వేశారు. రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగింది. పచ్చదనం పెంపు విషయంలో సర్పంచులను అభినందిస్తున్నా. దారులన్నీ పూలదారులుగా మారాయని ఇటీవల ఒక కవి రాశారు.” అని కేసీఆర్ అన్నారు.

వానలు వాపసు రావాలె.. కోతులు వాపసు పోవాలె.. పాట నేనే రాశానని కేసీఆర్ తెలిపారు. అడవులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. పచ్చదనాన్ని మరింత పెంచాలని సర్పంచులను కోరుతున్నానని చెప్పారు. పర్యావరణం బాగుంటేనే మన జీవితాలు బాగుంటాయని కేసీఆర్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version