బిగ్ బ్రేకింగ్; LIC ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం…!

-

ఎన్డియే సర్కార్ 2020-21 బడ్జెట్ లో భాగంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసి వాటాల విక్రయానికి ఆమోదం తెలిపింది. త్వరలో స్టాక్ మార్కెట్ లో ఎల్ఐసి లిస్టింగ్ ఉంటుందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ చెప్పారు.

అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనేది ఎవరికి అర్ధం కాలేదు. దీనిపై పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా కేంద్రానికి భారీగా ఖర్చు అవుతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే పెట్టుబడులను మరింత పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

దీనితో ఒక్కసారిగా ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగులు కానున్నారు. ఇక ఉద్యోగాల భర్తీ విషయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు…? ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ బడ్జెట్ లో కేంద్రం పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయానికి పెద్ద పీట వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news