2020-21 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసారు. 2.5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని ప్రకటించారు. 5 నుంచి7.5 శాతం ఉన్న వారికి 10 శాతం 7.5 నుంచి 10 ఉన్న వారికి 15 శతం 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పు 12.5 లక్షలు నుంచి 15 లక్షల వరకు 25 శాతం 15 లక్షలకు పైగా ఉంటే 30 శాతం అని చెప్పారు.
60 ఏళ్ల లోపు వారికి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ శ్లాబ్స్
రూ.2,50,000 లోపు ఆదాయం- ఎలాంటి పన్ను లేదు
రూ.2,50,001 నుంచి రూ.5,00,000 వరకు- రూ.2,50,000 దాటిన ఆదాయంపై 5% పన్ను
రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు- రూ.12,500+ రూ.5,00,000 దాటిన ఆదాయంపై 20% పన్ను
రూ.10,00,001 దాటితే- రూ.1,12,500+ రూ.10,00,000 దాటిన ఆదాయంపై 30% పన్ను
60-80 ఏళ్ల వయస్సువారికి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ శ్లాబ్స్
రూ.3,00,000 లక్షలు లోపు- ఎలాంటి పన్నులు లేవు.
రూ.3,00,001 నుంచి రూ.5,00,000 వరకు- 5% పన్ను
రూ.5,00,001 నుంచి రూ. 10,00,000 వరకు- 20% పన్ను
రూ.10,00,001 పైన- 30%
80 ఏళ్లు పైబడ్డవారికి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ శ్లాబ్స్
రూ.5 లక్షలు లోపు- ఎలాంటి పన్నులు లేవు.
రూ.5,00,001 నుంచి రూ. 10,00,000 వరకు- 20%
రూ.10,00,001 పైన- 30%