2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ప్రసంగిస్తున్నారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు ఊరట లభించింది. వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.
స్లాబుల సంఖ్య 7 నుంచి 5కు తగ్గింపు
పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలకు పెంపు
0-3 లక్షల ఆదాయం.. పన్ను ఉండదు
3-6 లక్షల అదాయం 5 శాతం పన్ను
6-9 లక్షల ఆదాయం 10 శాతం పన్ను
12-15 లక్షల ఆదాయం 20 శాతం పన్ను
15 లక్షల పైన ఆదాయం 30 శాతం పన్ను