కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. రైతులకు కొత్త బడ్జెట్ ఊరట కలిగిస్తున్నట్లు తెలుస్తుంది.2024లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే..అందుకే ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలు అన్నింట్లో వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక ప్రకటనలు ఉండవచ్చని సమాచారం..
కేంద్రం నుంచి అందుతున్న పథకాలను యధావిధిగా కొనసాగనున్నాయి..ఇక రైతులు ఎదురుచూస్తున్న 13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను త్వరలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా, భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి ఈ పథక లబ్ధిదారులైన రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం ఈ బడ్జెట్‌లో రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వాయిదా మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది..
గతంలో ఈ పథకం ద్వారా రైతులకు రూ.6 వేల రూపాయలు అందేవి..3 వాయిదాలో కేంద్రం రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసేది. తాజాగా ఆ మొత్తాన్ని రూ.8వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. అంటే రూ.2వేల చొప్పున నాలుగు విడతల ద్వారా రైతుల అకౌంట్ లో జమ చేయనున్నారు..ఈ పథకం పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి..