పీక్స్ కు చేరిన తెలంగాణ అరెస్టుల రాజకీయం.. కేటీఆర్ అరెస్ట్ తప్పదా..?

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా.. తెలంగాణ రాజకీయాలు ఇంకా హాట్ హాట్ గానే ఉంటున్నాయి.. విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.. తాజాగా పట్నం నరేందర్ రెడ్డిఅరెస్ట్ తో ఈ హీట్ మరింత పీక్స్ కు వెళ్ళింది.. త్వరలో కేటీఆర్ కూడా అరెస్టు అవ్వబోతున్నారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది..

కేటీఆర్ అరెస్ట్ అంటూ.. కొంతకాలంగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. కారు రేసులో కేటీఆర్‌ అరెస్ట్ ఖాయం అని కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది.. తాజాగా లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అటు బీఆర్ఎస్ తో పాటు.. అధికార కాంగ్రెస్ లో కూడా కనిపిస్తోంది.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది.. దీంతో కొన్నింటిపై విచారణ కూడా మొదలుపెట్టింది..

కార్ రేస్ వ్యవహారంతో పాటు.. మరికొన్నింటిలో విచారణ జరుగుతున్న సమయంలో మంత్రులు పొంగులేటి, పొన్నం వంటి నేతలు దూకుడు పెంచారు.. ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ ముఖ్యనేతలు అరెస్ట్ అవుతారంటూ మంత్రులు చెప్తూ వస్తున్నారు. దీపావళి కంటే ముందే పొలిటికల్ బాంబ్ లు పేలుతాయని పొంగులేటి వ్యాఖ్యానించడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది..

ఈ-ఫార్ములా కారు రేసు వ్యవహారంలో.. కేటీఆర్‌ను విచారించేందుకు.. రేవంత్ సర్కార్‌ గవర్నర్ అనుమతి కోరింది.. అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది.. సడన్ గా లగచర్ల ఘటన రూపంలో మరోసారి కేటీఆర్ టార్గెట్ అయ్యారు.. లగచర్ల దాడి ఘటన వెనక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్న రేవంత్ సర్కార్.. అందుకు సంబందించిన విచారణను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ పేరు కచ్చితంగా బయటకు వస్తుందని.. అప్పుడు ఆయన అరెస్ట్ తప్పదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం రంజుగా మారింది

Read more RELATED
Recommended to you

Exit mobile version