నటుడు సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి విపరీతంగా వర్షాలు కురవడంతో చాలామంది వారి ఇళ్ళను కోల్పోయారు. వరద ప్రవాహంలో కొంతమంది ఇళ్లులు కొట్టుకపోయాయి. తాజాగా పంజాబ్ లో ఇదే పరిస్థితి ఏర్పడింది. విపరీతంగా వర్షాలు కురవడంతో చాలామంది వారి ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇటీవలే పంజాబ్ లో పర్యటించడానికి నటుడు సోనూసూద్ అమృత్ సర్ కు చేరుకున్నాడు. అక్కడ ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది.

ముంపు గ్రామాలలో సోను సూద్ తిరిగి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నాడు . ఇల్లు కోల్పోయిన ప్రజలకు తిరిగి ఇల్లులను కట్టించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. పంజాబ్ లో వరదల కారణంగా 42 మంది మరణించారు. వరద ప్రవాహంలో దాదాపు 2000 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా సోను సూద్ తన గొప్ప మనసును చాటుకొని ప్రజలకు ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా సోనూసూద్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎంతోమందికి డబ్బు సహాయం చేశారు. ఇతర ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను వారి సొంత గ్రామాలకు చేర్చారు. సోను సూద్ చేసిన ఈ మంచి పనికి ప్రజలు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. రియల్ హీరో అనే కామెంట్లు పెడుతున్నారు.