చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం చాలా బాగుంటుంది. ఇలాంటి వాళ్లకు సహాయం చేయకూడదని చాణక్య అన్నారు. మరి ఎవరెవరికి సహాయం చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్య వ్యక్తిగత జీవితం గురించి, వైవాహిక జీవితం గురించి ఇలా ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్య నీతి శాస్త్రంలో ఇతరులకు సహాయం చేయడం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి అస్సలు సహాయం చేయకూడదని వారికి సహాయం చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. మంచి స్వభావం లేని స్త్రీని పెళ్లి చేసుకోవడం వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుందని.. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవద్దని అన్నారు.
దుర్భాషలాడుతూ వ్యక్తిత్వం సరిగా లేని స్త్రీలు జీవితానికి ఆటంకంగా మారుతారని చెప్పారు. మూర్ఖుడైన శిష్యుడికి సహాయం చేయకూడదని అజ్ఞానం ఉన్న శిష్యుడు ఏమీ నేర్చుకోడని.. తెలివి తక్కువ విద్యార్థి కోసం గురువు సమయాన్ని వృధా చేసుకోకూడదని చాణక్య అన్నారు. అలాగే వాళ్ళని పట్టించుకోకూడదని మూర్ఖంగా వాదిస్తే కూడా బాధపడకూడదని చాణక్య అన్నారు.
అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు విచారంగా ఉంటారు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడం మంచిది కాదు. చాణక్య అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి దూరం పాటించాలని అన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి దగ్గరగా ఉండకూడదు ఇలాంటి వ్యక్తులతో దూరంగా ఉంటేనే మంచిదని సహాయం చేయకూడదని పిరికితనంతో ఉండే వాళ్లకు భయంతో ఉండే వాళ్లకు ద్వేషపూరితంగా ఉండే వాళ్లకు కూడా దూరంగా ఉండాలని చెప్పారు. కాబట్టి ఈ విషయాలని జీవితంలో పాటిస్తే మీ విజయానికి ఆటంకులు ఉండవు.